Monday, August 4, 2014

విభిన్నమైన సినిమా

ఇతర సినిమాలకంటే ‘కట్టి బట్టి’ విభిన్నమైనదని బాలీవుడ్ నటి కంగనారనౌత్ పేర్కొంది. ఈ సినిమాలో ఇమ్రాన్‌ఖాన్ సరసన కంగన నటిస్తోంది. ‘ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇదొక చక్కని ప్రేమ కథా చిత్రం. బాలీవుడ్‌లో ఇప్పటిదాకా మనం చూసిన ప్రేమ కథా చిత్రాలకంటే ఇది విభిన్నంగా ఉంటుంది’ అని కంగన చెప్పింది. ఈ సినిమాలో ప్రేమ మూలకాన్ని అత్యంత విభిన్నంగా చిత్రించనున్నారని 27 ఏళ్ల ఈ కథానాయిక చెప్పింది. కాగా ఇమ్రాన్ సరసన కంగన నటించడం ఇదే తొలిసారి. కంగనాకు ఓ ఇటలీ సినిమా అవకాశం కూడా వచ్చింది.

 అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లో ఆ సినిమాకు డేట్లు ఇవ్వడం కష్టమని కంగన భావిస్తోంది.  ‘ఇటలీ సినిమాలో చేసే అవకాశం నాకు వచ్చి ంది. నా షెడ్యూల్ ప్రకారం ఆ సినిమా చేయగలుగుతానా లేదా అనే విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయాను’ అని అంది. ప్రస్తుతం కంగన ‘కిట్టీ’, ‘డివైన్ లవర్స్’, ‘తను వెడ్స్ మను 2’ మూడు సినిమాల్లో నటిస్తోంది. ‘కట్టి బట్టి సినిమాని యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఇటీవల విడుదలైన క్వీన్ సినిమా హిట్ అవడంతో తన పారితోషికాన్ని 50 శాతం మేర కంగనా పెంచిందనే వదంతులు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి.

 ఈ విషయమై కంగన మాట్లాడుతూ అందుకు తాను అర్హురాలినేనంది. పెం చాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటని ప్రశ్ని ంచగా గత ఏడు సంవత్సరాలుగా బాలీవుడ్‌లో పనిచేస్తున్నానని, ఇప్పటిదాకా నేను ఏమి సంపాదించాననే విషయమై విశ్లేషించుకున్నానని, పెంపునకు అర్హురాలినని అనిపించిందని చెప్పింది. కాగా 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో కంగన... బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

No comments:

Post a Comment