ప్రేమలో పడ్డ సినిమా తారలు ‘అలాంటిదేం లేదు. ఎవరో పనీ పాటా లేనివాళ్లు మా గురించి కథలు అల్లుతున్నారు’ అని చెబుతుంటారు. మొదట్లో దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ అలానే చెబుతూ వచ్చారు. తమ గురించి వచ్చే వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లలా అన్నారు కానీ, ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని బాలీవుడ్‌వారు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ‘దిల్ దడఖ్నే’ చిత్రబృందం ఈ ఇద్దరి గురించి చెవులు కొరుక్కుంటున్నారట.
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లొకేషన్‌కి దీపికా అడపా దడపా విచ్చేస్తున్నారని భోగట్టా. ఇస్తాంబుల్‌లో ఈ షూటింగ్ జరిగినప్పుడు దీపికా హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చారట. యూనిట్‌లో ఉన్న ఓ నటుడైతే ‘ఈ సినిమాలో మీరు అతిథిగా నటిస్తున్నారా? అందుకే ఇక్కడికి వచ్చారా’ అని సరదాగా అడిగాడని సమాచారం. అందుకు దీపికా, ముసిముసిగా నవ్వుకున్నారట. ఈ ఇద్దరూ చాలా సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని బాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
No comments:
Post a Comment