బాలీవుడ్ లో మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పీ.కే.' విడుదలకు ముందే వివాదాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన 'పీ.కే.' ఫస్ట్ లుక్ వివాదాస్పదంగా మారింది. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా ఆ పోస్టర్ లో ఉంది. ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకున్నాడు. అమీర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది.
No comments:
Post a Comment