ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయడం అంత సులువు కాదు. నిజానికి అలాంటి పాత్రలే ఏ నటీనటుల్లో అయినా పూర్తి ప్రతిభను వెలికి తెస్తాయి. ప్రస్తుతం కాజోల్ అలాంటి పాత్రకే పచ్చజెండా ఊపారు. ఇద్దరు బిడ్డలకు తల్లయిన తర్వాత కాజోల్ దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం ‘వియ్ ఆర్ ఫ్యామిలీ’ చిత్రంలో నటించిన ఆమె ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. తాజాగా అంగీకరించిన చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
బుల్లితెర సిరీస్ ‘పెనోజా’ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మాఫియా సామ్రాజ్యాన్ని ఏలిన తన భర్త చనిపోగానే తానే మాఫియా డాన్‌గా మారే మహిళ కథ ఇది. ఆ పాత్రకు కాజోల్ అయితే బాగుటుందని చిత్రదర్శకుడు రామ్ మధ్వానీ భావించారట. కథ నచ్చడంతో మరో ఆలోచనకు తావివ్వకుండా ఆమె అంగీకరించారు. ఈ చిత్రాన్ని ఎండెమోల్ ఇండియాతో కలిసి అజయ్ దేవగన్ నిర్మించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
No comments:
Post a Comment