Sunday, August 10, 2014

ముద్దు సీన్లలో హీరోలు నాకు పోటీ ఇవ్వడం లేదు

బాలీవుడ్ లో 'సీరియల్ కిస్సర్' అనే ట్యాగ్ ఆ హీరోకు మాత్రమే సొంతం. హిందీ చలన చిత్ర సీమలో ప్రస్తుత టాప్ హీరోయిన్ల అందర్ని దాదాపు ముద్దులతో ముంచెత్తిన ఘనత ఆయనది. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. ముద్దు సీన్లలో నాతో యువ హీరోలు పోటీ పడలేకపోతున్నారని తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా హిందీ తెరకు పరిచయమైన హీరోలు నాతో పోటీ పడటం లేదు అని ఇమ్రాన్ అన్నారు. 
తెరమీద యువ హీరోలు కేవలం ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ ముద్దుల్లో ఫీల్ ఉండటం లేదని తనతో ఎవరో అన్నారని ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ముద్దు సీన్లలోతన 1000 గంటల అనుభవం ముందు కుర్రకారు తేలిపోతున్నారని ఆయన అన్నారు.  అ మర్దర్, జహార్, వో లమ్హే చిత్రాల్లో ముద్దలతో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే.

 ముద్దు పెట్టడం ఒక కళ.. అది అందరికీ వచ్చేది కాదంటున్నాడు ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ. ఆన్‌స్క్రీన్‌పై చుంబనాలతో విరుచుకుపడే హష్మీ.. మిగతా వారికి తనలా ముద్దించడం సాధ్యం కాదని బడాయి పోతున్నాడు. పెదాలకు లంగరేయడంలో వెయ్యి గంటల ఎక్స్‌పీరియన్స్ ఉన్న తనకూ, ఈ విషయంలో కనీసం పది గంటల పనితనం లేని వారికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment