బాలీవుడ్ వర్ధమాన నటి, మోడల్ శ్రీజిత డె ఇటీవల దోపిడికి గురయ్యారు. ఇటీవల ముంబై సమీపంలో వెస్ట్రన్ ఎక్స్�ప్రెస్ హైవేపై కారులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
శ్రీజిత సమీప బంధువులతో కలసి ముంబైకి దగ్గరలోని ఓ డాబాకు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి బయల్దేరారు. స్థానిక గూండాలు ఆమెపై దౌర్జన్యం చేశారు. మొబైల్ ఫోన్�, ఇతర వస్తువులు దోచుకున్నారు. దోపిడి జరిగిన విషయంపై శ్రీజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజిత రెండు మూడు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సీరియళ్లలో నటించారు.
No comments:
Post a Comment