Sunday, August 10, 2014

ఎలాంటి సీన్లో నైనా నటిస్తా : దీక్షాసేత్

 ఒక సినిమా అంగీకరించిన తరువాత ఎలాంటి సీను చేయడానికైనా తనకు అభ్యంతరం లేదని బెంగాలీ బ్యూటీ దీక్షాసేత్ చెబుతున్నారు. సందర్భాన్ని బట్టి ముద్దు (లిప్�లాక్ ) సీన్లు కూడా చేస్తానంటున్నారు.  ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి కోలీవుడ్�కు వెళ్లింది. అక్కడా లాభంలేకపోవడంతో పట్టువదలని దీక్షతో బాలీవుడ్� ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఏమైనా లక్కుంటుందేమోనని ప్రయత్నిస్తోంది.  వేదం సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ అందాల తార  ఆ తర్వాత వాంటెడ్, రెబల్, మిరపకాయ, నిప్పు చిత్రాల్లో నటించింది. ఈ భామ తెలుగులో తనదైన గ్లామర్�తో చెలరేగిపోయింది. దీక్షా దగ్గర గ్రామర్ ఉంది గానీ, అవకాశాలే రాలేదు పాపం. చెప్పుకోదగ్గ హిట్స్ కూడాలేవు. సుదీర్ణ ప్రయత్నాలు చేసిన తరువాత  అసలు సక్సెస్ ఫార్ములాను కనుక్కున్నట్లు చెబుతోంది.

దీక్షాసేత్�కు ప్రస్తుతానికి  తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం ఒక్క సినిమా 'లేఖర్ హమ్ దివానా దిల్' లో నటించింది. టాలీవుడ్�లో అలవాటుపడినవారు వదలడం కష్టం. తెలుగులో మళ్లీ  అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  దీక్షాసేట్�కు ఒక సినిమాలో నటించేందుకు టాలీవుడ్� నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన దీక్షాసేత్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  అంతే కాకుండా ఈ హీరోతో లిప్�లాక్�కు సైతం తను సిద్ధపడినట్లుగా టాలీవుడ్�లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని  దీక్షాసేత్ చెబుతోంది.

సినిమాలలో లిప్�లాక్ సీన్లతోపాటు రొమాన్స్ సీన్లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అటువంటి సీన్లలో ఇప్పటికే  చాలామంది  హీరోయిన్లు నటించారు. మిగిలినవారిలో కూడా చాలా మంది అటువంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశారు. అదేదో గొప్ప విషమైనట్లు కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అవకాశాలకు మార్గాలు తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ దీక్షాసేత్ ఇటీవల మాట్లాడుతూ ''ఒక సినిమా ఒప్పుకున్నాక సీన్ డిమాండ్�ను బట్టి దర్శకుడు చెప్పినట్లు చేయాలి. నా వరకు నాకు ఎలాంటి సీను చేయడానికైనా అభ్యంతరం లేదు. సందర్భాన్ని బట్టి లిప్�లాక్ సీన్లు కూడా చేస్తాను" అని చెప్పింది. స్టార్‌ డం హీరోలకి సరసన లిప్�లాక్ సీన్స్�తో పాటు, ఘూటైన రొమాన్స్ చేయటానికి సైతం ఒప్పుకోవడంతో, దీక్షాకు అవకాశాలు  పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలను ఒప్పుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి  తన కెరీర్�ను సక్సెస్ వైపు నడిపించడానికి దీక్షాసేత్ అనుకుంటోంది.

No comments:

Post a Comment