బాలీవుడ్�లో కాస్త గౌరవప్రదంగా నటిస్తుంది అని చెప్పుకోదగ్గ వాళ్లలో నేహా శర్మ ఒకరు. అయితే.. ఇప్పుడు ఆమె కూడా హాట్ హాట్ ఫొటో పోజులు ఇస్తూ వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా ఎఫ్�హెచ్ఎం మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం నేహా శర్మ నల్లటి దుస్తుల్లో హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ పత్రిక కవర్�పేజీపై నేహా శర్మ సెక్సీఫొటో దర్శనమిచ్చింది. దాంతో ఇక నేహాశర్మకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని, మంచి మంచి పాత్రలు వస్తాయని అంటున్నారు.
నేహా మొట్టమొదటే ఇమ్రాన్ హష్మితో కలిసి క్రూక్ అనే సినిమాలో చేసింది. ఆ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఆ తర్వాత బాలాజీ టెలిఫిలింస్ బ్యానర్�లో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమా చేసినా, దాంతోనూ పెద్దగా లాభం రాలేదు. ఆ తర్వాత చేసిన యంగిస్థాన్ సినిమాతో మాత్రం ఆమె కాస్తంత వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఎఫ్�హెచ్ఎం లాంటి మ్యాగజైన్ కవర్ పేజి మీద రావడంతో సినిమాల్లో సైతం అలా కనిపించడానికి అభ్యంతరం లేదన్న సందేశాన్ని నేహ ఇచ్చిందనే అందరూ అంటున్నారు.
No comments:
Post a Comment