Sunday, August 10, 2014

పెట్టుబడుల్లో నిలువెత్తు శిల్పాశెట్టి

బాలీవుడ్  హీరోయిన్ శిల్పా శెట్టి.. సాహసవీరుడు-సాగర కన్య లాంటి  కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యమధ్యలో వివాదాలు ఉన్నా .. ఐపీఎల్ క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది.  కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్‌మెంట్లు, మనీ మేనేజ్‌మెంట్‌పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టయిల్‌లో..

బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండార్స్‌మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఉంటుందని అంచనా.  కేవలం గ్లామర్ ఫీల్డ్‌కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృథాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో ఎస్2 పర్ఫ్యూమ్‌ని లాంచ్ చేసింది. అలాగే, యోగాపై డీవీడీ వీడియోలు ప్రవేశపెట్టింది.

మరోవైపు, బిజినెస్‌మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది ఐపీఎల్ క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆన్‌లైన్ ప్రాపర్టీ బ్రోకరేజి బిజినెస్‌తో పాటు గ్రూప్‌కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్‌యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు.

శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్‌గా ఉంటుంది.  మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. భవిష్యత్ సురక్షితంగా ఉండటం కోసం చేసేవే కాబట్టి వీటి ని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణి ంచవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి.
 

No comments:

Post a Comment