జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ పొందనంత ఆనందాన్ని ప్రియాంకా చోప్రా చవి చూస్తున్నారు. ఆ ఆనందానికి కారణం ‘మేరీ కామ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచి ప్రియాంకకు ప్రశంసలు మొదలయ్యాయి. ‘బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కామ్‌లానే ఒదిగిపోయారు’ అని ప్రియాంకను చాలామంది అభినందిస్తున్నారు. ఈ అభినందనల గురించి ప్రియాంక చెబుతూ -‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు నేను పడవలో ఉన్నాను. జోయా అక్తర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం పడవలో కీలక సన్నివేశాలు చిత్రీకరణలో పాల్గొంటున్నాను. ‘మేరీ కామ్’ ఫస్ట్ లుక్ విడుదలైన మూడు గంటలకు నాకు మూడువందల యాభై మెయిల్స్ వచ్చాయి. అలాగే, నా ఫోన్‌కి ఆరు వందల మెసేజ్‌లు వచ్చాయి. ఇక, ట్వీట్స్ అయితే లెక్కలేనన్ని. కెరీర్ ఆరంభించిన ఈ పధ్నాలుగేళ్లల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి’’ అన్నారు.
No comments:
Post a Comment