Sunday, August 3, 2014

బాలీవుడ్ దోస్తానా

బాలీవుడ్ దోస్తానా

 బాలీవుడ్‌లో తెరపైనే కాదు, నిజజీవితంలోనూ దోస్తానా కొనసాగించే నటీనటులు ఉన్నారు. అలాంటి జిగిరీ దోస్తుల గురించి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా...

 దీపికా పడుకొనే- సహానాగోస్వామి
 కెరీర్ ప్రారంభం నుంచే వీరిద్దరూ సన్నిహిత నేస్తాలు. ఇద్దరూ కలసి స్కూబా డైవింగ్ చేసేవారు. హ్యాంగౌట్లకు వెళ్లేవారు. ఇప్పటికీ అరమరికలు లేకుండా ఒకరి రహస్యాలు మరొకరికి చెప్పుకుంటారు. ‘సహానా నా బెస్ట్ ఫ్రెండ్. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరం కలసి ఒక చిత్రంలో నటించాం కూడా. షూటింగ్‌ల కోసం ఎక్కడకు వెళ్లినా, ముంబైకి తిరిగి వచ్చాక నేను చేసే మొట్టమొదటి ఫోన్‌కాల్ సహానాకే’ అని దీపికా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

 షారుఖ్ ఖాన్- జూహీచావ్లా
 బాలీవుడ్‌లో చిరకాల మైత్రి కొనసాగిస్తున్న వారిలో షారుఖ్ ఖాన్, జూహీచావ్లాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వ్యాపార లావాదేవీల కారణంగా చిన్నచిన్న పొరపొచ్చాలు తలెత్తినా, ఇప్పటికీ వీరి స్నేహం చెక్కు చెదరకుండా ఉంది. ‘వ్యాపార భాగస్వాములుగా కొనసాగడం మానేశాం. అందుకే ‘షారుఖ్‌తో నా మైత్రి ఇంకా కొనసాగుతోంది’ అని జూహీ చెప్పింది. తన తల్లి 1998లో మరణించిన సమయంలో షారుఖ్ తనకు ఎంతగానో ఆసరా ఇచ్చాడని తెలిపింది.

సల్మాన్‌ఖాన్- అజయ్‌దేవ్‌గన్

 వీరిద్దరి దోస్తీ గురించి ఎక్కువమందికి తెలియదు. అయితే, చాలాకాలంగా వీరిద్దరూ మంచి మిత్రులు. సల్మాన్‌ఖాన్ నటించిన ‘రెడీ’లో అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్ర పోషిస్తే, అజయ్ ‘సన్ ఆఫ్ సర్దార్’లో సల్మాన్ ఒక ఐటం సాంగ్‌లో మెరిశాడు. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’, ‘లండన్ డ్రీమ్స్’ చిత్రాల్లో కలసి నటించారు కూడా. తమ సినిమాలను ఒకరికొకరు చూపించుకునేందుకు ప్రత్యేక ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.

No comments:

Post a Comment