బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. షారుక్ ఖాన్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. బాలీవుడ్ కింగ్ షారుకే అంటూ సల్మాన్ కితాబిచ్చాడు. సల్మాన్ నటించిన తాజా చిత్రం కిక్ వంద కోట్ల రూపాయిలను వసూలు చేసింది. బాలీవుడ్ లో వరుసగా ఏడు సినిమాల్లో వంద కోట్ల రూపాయిలు వసూలు చేసిన తొలి హీరోగా సల్మాన్ రికార్డు సృష్టించాడు.
వరుసగా హిట్ సినిమాలతో బాలీవుడ్ కు కొత్త కింగ్ అయ్యారా అన్న ప్రశ్నకు.. షారుక్ ఖాన్ ను ఉద్దేశించి బాలీవుడ్ కింగ్ అతనే అని అన్నాడు. అతనితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు. బాలీవుడ్ లో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు అన్న మరో ప్రశ్నకు.. తనకు నెంబర్ల గురించి ఆస్తకిలేదని సల్మాన్ సమాధానమిచ్చాడు.

No comments:
Post a Comment