బాలీవుడ్డా... అసలు ఆ పేరే ఎత్తొద్దు. చిరాకేస్తుంది’’ అంటున్నారు అందాల భామ త్రిష. హిందీలో అక్షయ్‌కుమార్‌తో ఆమె జతకట్టిన ‘కఠ్ఠా మీఠా’ చిత్రం పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను ‘మళ్లీ బాలీవుడ్‌లో ప్రయత్నం చేయొచ్చుగా?’ అని మీడియా అడిగితే ఘాటుగా స్పందించారు. ‘‘ఏడాది పాటు సినిమా చేయాలి. మూడు నెలల పాటు ప్రమోషన్‌లో పాల్గొనాలి. అంత ఓపిక నాకు లేదు. ఆ సమయంలో దక్షిణాదిన రెండు మూడు సినిమాలు చేయొచ్చు.
అయినా, ఒక్క సినిమాకే బాలీవుడ్ బోర్ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణగారితో చేస్తున్నా. ఒక కన్నడ చిత్రం, నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. ఈ సినిమాలు చాలవా! ఇక బాలీవుడ్ దేనికి?’’ అన్నారు త్రిష. ఇదిలావుంటే... త్రిష గురించి ఓ తాజా వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి త్రిష పచ్చజెండా ఊపేశారట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన ఈ చిత్రం యూనిట్ నేడో రేపో చిత్రీకరణకు దిగనుందట. రజనీతో జత కట్టాలనేది త్రిష చిరకాల వాంఛ. ఆ కోరిక ఈ రకంగా నిజమవుతున్నట్టుంది.

No comments:
Post a Comment