పెళ్లింతో పనేంటి లాంటి చిత్రాలను తెరపై మాత్రమే చూశాం. అయితే నిజజీవితంలో పెళ్లితో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి లక్ష్మీమీనన్. ఈ మలయాళ కుట్టి పెళ్లి చేసుకోని అరుదైన నటీమణుల పట్టికలో చేరనుందని ఆమె మాటల్లోనే తెలుస్తోంది. ఈ తరం హీరోయిన్స్‌లో విజయపథంలో దూసుకుపోతున్న నటి లక్ష్మీమీనన్. కోలీవుడ్‌లో కుంకీ చిత్రంలో హీరోయిన్‌గా పయనం ఆరంభించిన ఈ అమ్ముడు ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ క్రేజ్‌లో ఉంది. ప్రేమ, పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భామ బదులిస్తూ, ప్రస్తుతం తన దృష్టిఅంత నటనపైనే సారిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంది. సూర్యతో రొమాన్స్ చేయూలన్నది తన ఆశ అని అదే విధంగా విజయ్, అజిత్‌లతో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇకపోతే మలయాళంలో మమ్ముట్టి సరసన నటించాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పింది. విశాల్‌తో నటించిన రెండు చిత్రాలు హిట్ అయ్యాయని చెప్పింది. ఆయనతో ఎలాంటి అసౌకర్యం కలగలేదని అంది. ఆయనతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించిన ఈ భామ, చాలా సౌకర్యంగా ఉందనడంలో మర్మమేమిటో...?

No comments:
Post a Comment