
ఈ మధ్య ఆర్య సరసన రాజారాణి చిత్రం లో నటించినప్పుడు వీరిద్దరి గురించి కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఆర్య నయనకు బిర్యాని విందునిచ్చారని, ఇద్దరూ నక్షత్ర హోటళ్లలో ఏకాం తంగా కలుసుకుంటున్నారని రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. అవ న్నీ వదంతులే అంటూ నయనతార ఖండించారు. తాజాగా శింబుతో సాన్నిహిత్యం గురించి మరోసారి గాసిప్సు గుప్పుమన్నాయి. వీటిపై నయనతార స్పందిస్తూ తన గురించి చాలా వదంతులు ప్రచారమవుతున్నాయన్నారు. ఆర్యను ప్రేమిస్తున్నట్లు, శింబుతో షికార్లు అంటూ ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని చెప్పారు. తాము నటులమ ని, వృత్తిపై అంకితభావం చూపిస్తున్నామని అన్నారు.
ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతామన్నారు. అంతేకానీ తమ మధ్య ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. అయి తే ఇలాంటి వదంతులకు కొందరు న టీనటులు ఇష్టపడతారనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బా లీవుడ్ తారలు ఇలాంటి గ్యాసిప్స్‌ను ప్రచారం చేస్తారని, తద్వారా వారు ఫలం పొందుతున్నట్లు చెబుతారని అన్నారు. అందువల్లే తమ గురిం చి వదంతులు ప్రచారం అయినప్పటికీ ఆనందిస్తారన్నారు. ఆ సంస్కృతి ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యిందని అన్నా రు. తెలుగులో ఇలాంటి పరిస్థితి లేదని నయనతార తెలిపారు.
No comments:
Post a Comment