Monday, August 11, 2014

బీహార్ మంత్రితో శ్రుతిహాసన్!

 బీహార్ మంత్రితో శ్రుతిహాసన్!

బీహార్ మంత్రితో శ్రుతిహాసన్ అనగానే వెంటనే ఏవేవో ఊహించుకోకండి. పూజై చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. పూజై చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బీహార్ యువజన సంక్షేమ శాఖ మంత్రి వినయ్ బీహారి కలెక్టర్‌గా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఆయన నటించడం అన్నది కాకతాళీయంగా జరిగిందట. పూజై చిత్రం కథ కొంత భాగం బీహార్‌లో జరుగుతుందట. దీంతో విశాల్ పోరాట దృశ్యాలను అక్కడ చిత్రీకరించారు. అయితే ఆ లొకేషన్స్ అనుమతి కోసం మంత్రి వినయ్ బీహారీ చిత్ర దర్శక నిర్మాతలు కలిశారు. అప్పుడు మీ చిత్రంలో నటించే అవకాశం కల్పించామని మంత్రి దర్శకుడు హరిని కోరారు. తాను పలు బోజ్‌పురి చిత్రాల్లో నటించినట్లు, ఒక చిత్రానికి దర్శకత్వం కూడా నెరపినట్లు మంత్రి తెలపడంతో పూజై చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment