
‘రిషికేష్ సినిమాల్లో ఎక్కువ శాతం సందేశంతో కూడిన హాస్యభరిత సినిమాలే.. అవి ఆద్యంతం నవ్విస్తూనే ఎంతో కొంత ఆలోచింపజేసేలా ఉండేవి..’ అని చెప్పింది. ప్రస్తుతం అలాంటి సినిమాలను రాజు హిరానీ నిర్మిస్తున్నాడని సోనమ్ వ్యాఖ్యానించింది. కాగా, ఖూబ్‌సూరత్‌లో హీరోయిన్ పాత్ర ఆలోచన విధానం, ఆహార్యం నిజజీవితంలో తన వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుందని సోనమ్ చెప్పింది. చాలావరకు తాను బయట ఎలా ప్రవర్తిస్తానో ఈ సినిమాలో ‘మిలీ’(పాత్ర పేరు) కూడా అలాగే ప్రవర్తిస్తుందని ఆమె అంది. తనలోని నటనను ఈ సినిమాలో నిర్మాత, డెరైక్టర్లు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని వ్యాఖ్యానించింది.
ఈ సినిమా సెప్టెంబర్ 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని కోసం తాను ఎంతో ఎదురుచూస్తున్నానని సోనమ్ చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ప్రముఖ పాకిస్థానీ నటుడు, గాయకుడు ఫవాద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేశారు. అలాగే కిరణ్ ఖేర్, రత్నా పాఠక్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర లు పోషించారు. డిస్నీ, సోనమ్ సోదరి రియా కపూర్, తండ్రి అనిల్ కపూర్ సంయుక్తంగా దీనిని నిర్మించారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వం వహించాడు.
No comments:
Post a Comment