Monday, August 4, 2014

బాక్సాఫీస్ రికార్డులతో కిక్కెక్కిస్తున్న సల్మాన్!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ కిక్కెక్కిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్', సల్లూభాయ్ నటించి 'దబాంగ్2' చిత్రం వసూళ్లను 'కిక్' అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. 
దబాంగ్ చిత్ర వసూలు చేసిన 265 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. కిక్ చిత్రం రెండవ శుక్రవారం ముగింపు రోజున ప్రపంచవ్యాప్తంగా 313 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం భారత దేశంలోనే నికరంగా 197.70  (గ్రాస్ 262) కోట్ల రూపాయలను వసూలు చేసింది.

No comments:

Post a Comment