రాజ్‌మహల్ జ్యూయెలర్స్ ఇండియా కోషర్ వీక్‌లో డిజైనర్ మనీశ్ మల్హోత్రా కోసం ఆలియా భట్ ర్యాంప్‌పై తళుక్‌ముంది. వధువు కోసం డిజైన్ చేసిన ఎరుపురంగు గౌనులో జిగేల్‌మంది. అయితే క్యాట్‌వాక్ చేసేందుకు బాగా కష్టపడాల్సి వచ్చిందట. మనీశ్ రూపొందించిన గౌన్ ఏకంగా 25 కేజీల బరువు ఉంది. దీనిని వేసుకొని హైహీల్స్ చెప్పులతో ర్యాంప్‌పై నడిచేటప్పుడు చాలా చిరాకుగా అనిపించిందని ఈ కుర్ర హీరోయిన్ చెప్పింది. ‘ర్యాంప్‌పై నడవడం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు ఊరికే చిరాకు వస్తుంటుంది.
25 కేజీల బరువున్న గౌనుకుతోడు హైహీల్స్ చెప్పులు వేసుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతుంటారు. ఈ సమయంలో కాస్త చిరాకేసినా, అద్భుతంగా అనిపిస్తుంది’ అని వివరించింది. ఆలియా క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఆదిత్యరాయ్ కపూర్ వెంట నడవగా, ఊర్మిళా మతోంద్కర్, హ్యుమాఖురేషీ ప్రేక్షకుల వరుసలో కూర్చున్నారు. బాలీవుడ్ ఎందరో ప్రముఖ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేసే మనీశ్ కోసం క్యాట్‌వాక్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ బ్యూటీ చెప్పింది. ఒకప్పుడు మనీశ్ డిజైన్లను చూసేందుకు ఫ్యాషన్ షోలకు వెళ్లిన రోజులను కూడా ఈమె ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకుంది.

No comments:
Post a Comment