Sunday, August 3, 2014

అధరం.. మధురం.... గచ్ఛామి!


ఆఫ్ స్క్రీన్‌పై ఎలా ఉన్నా.. ఆన్‌స్క్రీన్‌పై బుద్ధిమంతుడిగా కనిపించే సల్లూ.. లైన్ దాటాడు. కామన్‌గా తన సినిమాల్లో లిప్‌లాక్‌లకు చోటివ్వని సల్మాన్ ‘కిక్’లో మాత్రం.. పెదాలు కలిపాడట. జాక్వెలిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాడట. ఈ కండల వీరుడు ముద్దు సన్నివేశం ఎలా పండించాడో చూడాలి!

 స్క్రీన్‌పై ముద్దులు పంచే ఇమ్రాన్‌హష్మీని చూసి మొదట్లో ఆకతాయి అనుకున్నాననేది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్ కామెంట్. రాజా నట్వర్‌లాల్ సినిమాలో హష్మీతో చేసిన ఈ అమ్మడు మాట మార్చుకుంది. హష్మీ ఎలాంటివాడో ఆయనతో కలసి నటి స్తే గానీ తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఫన్నీగై అని కితాబిచ్చింది.

 సోనమ్ కపూర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రానున్న ‘ఖూబ్‌సూరత్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ముద్దు సీన్ సోషల్ హబ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఖూబ్‌సూరత్’లో హీరో విక్రమ్ బుగ్గలను అధరాలతో తడిమిన సీన్‌ను సోనమ్ ఆన్‌లైన్‌లో ‘షేర్’ చేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

No comments:

Post a Comment