Sunday, August 3, 2014

ఐటెం సాంగులకైనా రెడీ



  బాలీవుడ్సినిమాల్లో తాను ఐటెం సాంగులుచేయడానికి కూడా సిద్ధమేనని చెబుతోందిజాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ సినిమాలలో పాటలు, డాన్సులు చాలా ముఖ్యమైన భాగమని, అందుకే.. ఏదైనా సినిమాలో తనకుఐటెం సాంగ్ వస్తే తప్పకుండాచేస్తానని శ్రీలంక చిన్నదిచెప్పింది. ప్రస్తుతం కిక్ సినిమా ప్రమోషన్లో మహా బిజీగాఉన్న జాక్వెలిన్.. ఎందుకోగానీ, కత్రినా కైఫ్ను పొగడ్తల్లోముంచెత్తింది.

కత్రినా కైఫ్ భలే కష్టపడిపనిచేస్తుందని, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచిఆమె బాలీవుడ్ను ఏలుతోందని జాక్వెలిన్ఫెర్నాండెజ్ తెగ పొగిడేసింది. కిక్సినిమాలో హీరో సల్మాన్ఖాన్కు మాజీ ప్రేయసిఅయిన కత్రినాను పొగిడితే తనకు ఉపయోగం ఉంటుందనిభావించిందో ఏమో గానీ.. పని మొదలుపెట్టింది. కష్టపడకుండా ఏమీ సాధించలేమని, కత్రినాఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుండటంవల్లే ఇన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోందనితెలిపింది.

No comments:

Post a Comment