Monday, August 11, 2014

విక్రమన్ దర్శకత్వంలో సూర్య


 విక్రమన్ దర్శకత్వంలో సూర్య నటనలో వైవిధ్యం కోసం తపించే నటుల్లో సూర్య ఒకరు. ఆయన కథలపై చూపే శ్రద్ధ దర్శకులను ఎంపిక చేసుకునే విధానంలో పరిణితి స్పష్టం అవుతుంది. చిత్రం చిత్రానికి తాను ఎదుగుతూ, తన చిత్రాల విజయాల స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే హీరోగా సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదుగుతున్నారు. సింగం, సింగం -2 వంటి రాక్ హిట్లు తరువాత అంజాన్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో తెరపైకి రానున్నారు. అంజాన్ ఈ నెల 15న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్‌గా సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు.

సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నారు. విక్రమన్ ఇంతకు ముందు యావరుంనలం చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఇటీవలే తెలుగులో అక్కినేని కుటుంబంతో మనం అనే చిత్రంతో అద్భుతమయిన విజయాన్ని అందుకున్నారు. ఈ బహుభాషా దర్శకుడు సూర్య కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేస్తున్నారట.

దీని గురించి విక్రమన్ మాట్లాడుతూ సూర్య కోసం కథ తయారు చేస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఈ చిత్రం ఆయన నటిస్తున్న మాస్ చిత్రం తరువాత సెట్‌పైకి రానుందని తెలిపారు. ఈ కథ ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంటూ అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుందన్నారు. చిత్రంలో ఇద్దరు కథా నాయికలు ఉంటారని, అయితే వాళ్ల ఎంపిక జరగలేదని వివరించారు.

No comments:

Post a Comment