గత ఏడాది హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘ఆషికి 2’ ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో సచిన్ జోషి, నాజియా జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేశ్ పునర్నిర్మించారు. సచిన్ తన మనోభావాలు పంచుకుంటూ -‘‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కొంత విరామం తర్వాత తెలుగులో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని, ‘ఆషికి-2’ వంటి క్యూట్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందని ఈ రీమేక్‌లో నటించాలనుకున్నాను.
ఇందులో హీరో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. ముందు ఈ పాత్ర చేయడానికి కొంచెం భయపడ్డాను. తెలుగుకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా క్లయిమాక్స్ ఊహించని మలుపుతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పాటలు పెద్దలు హిట్టయ్యాయి. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం’’ అని చెప్పారు. ‘ఆషికి-2’ తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాననీ, తెలుగులో ఓ హారర్, ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్నానని సచిన్ తెలిపారు. అలాగే, థింక్ టాంక్ అనే సంస్థను ప్రారంభించి, లఘు చిత్రాలతో పాటు అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని వెల్లడించారు.
No comments:
Post a Comment