Sunday, August 10, 2014

కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ముమైత్‌ ఖాన్‌ ఆల్బమ్

 
ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌  కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా  ఆల్బమ్� రూపొందించారు.  ఆ ఆల్బమ్� జనం ముందుకు వచ్చేసింది. ముమైత్‌ ఖాన్‌�ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్�కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్�తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌�తో ఈ ఆల్బమ్�ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు.

ముమైత్‌ ఖాన్ పేరు చెప్పగానే మనకు  దాదాపు ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్�లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పోకిరి' సినిమాలోని 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ఈ పాట కూడా అదే స్థాయిలో జనాన్ని ఉర్రూతలూగించింది. దీంతో ముమైత్‌ ఖాన్‌ రేంజి రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో  ఈ ముద్దుగుమ్మ దుమ్ము రేపేసింది. ఎంత పదారేళ్ల వయసు అయినా, కొంత కాలానికి మొహం మొత్తుతుంది కదా!. అలా ముమైత్‌ తెర వెనక్కు పోయింది. అయినప్పటికీ నిరుత్సాహ పడటం లేదు. ముమైత్�లో యాక్టివ్�నెస్ గానీ, ఆ ఊపుగానీ  ఏమీ తగ్గలేదు.  ఇప్పుడు కొత్త అవతారంలో జనం ముందుకొచ్చింది. అడిక్షన్‌ పేరుతో ఓ పాట పాడి ఆల్బమ్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. నాలుగు నిమిషాల ఈ ఆల్బమ్�లో మళ్లీ తన సత్తా చూపింది. దీంతో మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయనే ఆశతో ముమైత్‌ ఖాన్‌ ఉంది. ఆమె ఆశ నెరవేరాలని ఆశిద్ధాం.

No comments:

Post a Comment