Sunday, August 10, 2014

దరియా మహల్ కోసం ప్రియాంక చోప్రా 100 కోట్లు!

సొంత ఇల్లు విషయంలో సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు ఓ ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. సొంత ఇంటి నిర్మాణం విషయంలో స్పెషలిస్ట్ డిజైనర్లను, కోట్ల రూపాయలను వెచ్చించి డిఫరెంట్ లుక్ తో ఎందరో తమ నివాసాలను నిర్మించుకోవడం చూశాం.. విన్నాం కూడా. తన సొంత ఇంటి విషయంలో తనకు ప్రత్యేకమైన టేస్ట్ ఉందని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నిరూపించింది. ముంబైలోని వెర్సోవా లోని బీచ్ ఒడ్డున ఉన్న పురాతన బంగ్లాపై ప్రియాంక కన్నేసింది. ఈ పురాతన బంగ్లాను 'దరియా మహల్' పిలుస్తారు. ఈ ఇంటిలో విలువైన పురాతన వస్తువులు కూడా ఉండటంతో ప్రియాంక మరింత మోజు కలిగినట్టు తెలుస్తోంది. 
 
బాలీవుడ్ లో అనేక సినిమా షూటింగ్ లు జరుపుకున్న ఈ బంగ్లాను ప్రముఖ వస్త్ర వ్యాపారి మనేక్లాలా చునిలాల్ చినాయ్ కోసం 1930లో బ్రిటిష్ అర్కిటెక్ట్ క్లాడ్ బాట్లే నిర్మించారు. ఈ భవనాన్ని ఇప్పటికే ప్రియాంక చోప్రా కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ పురాతన ఇంటిలో సుమారు 15 బెడ్ రూమ్ లున్నాయని ఓ ప్రముఖ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. ప్రియాంక సొంతం చేసుకున్న ఈ పురాతన బంగ్లా ఖరీదు 100 కోట్లు. మేరికోమ్ గా త్వరలో కనిపించనున్న ప్రియాంక చోప్రా తన లోకండ్ వాలాలోని నివాసం కంటే పురాతనపైనే ఎక్కువ మోజు పెంచుకుంటుందట.

No comments:

Post a Comment