సంజయ్‌దత్ నిర్మిస్తున్న ‘హస్‌ముఖ్ పిఘల్ గయా’ చిత్రం కోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారుతున్నాడు. ఇదివరకు ‘సిల్‌సిలా’, ‘లావారిస్’ వంటి చిత్రాల్లో తన గానాన్ని వినిపించిన అమితాబ్, ఇటీవల ‘భూత్‌నాథ్ రిటర్న్స్’లో కూడా ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. రాజ్‌కపూర్ నటించిన ‘అనాడీ’ చిత్రంలో ముకేశ్ పాడిన ‘కిసీకో ముస్కురాహటోంపే హో నిసార్’ పాటనే అమితాబ్ ఈ సినిమా కోసం తిరిగి పాడనుండటం విశేషం.
No comments:
Post a Comment