Sunday, August 3, 2014

మేకప్ మ్యాన్ భార్యకు అమితాబ్ భారీ బహుమతి

అమితాబ్ బచ్చన్.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బాలీవుడ్ మెగాస్టార్ కు ఎవరైనా కష్టపడుతున్నట్లు తెలిస్తే చాలు, ఆయన గుండె ఇట్టే కరిగిపోతుంది. దాదాపు 40 ఏళ్లుగా తన మేకప్ మ్యాన్ గా ఉన్న దీపక్ సావంత్ భార్యకు ఆయన ఏకంగా రేంజిరోవర్ కారు బహూకరించారు. దీపక్ సావంత్ భార్య సరోద్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాను కూడా లగ్జరీ కారులో తిరగాలని, ఆ కారు తన సొంతం కావాలని ఆమెకు కోరిక ఉండేది. ఆ విషయం ఎలాగో అమితాబ్ చెవిన పడింది. దాంతో వెంటనే ఆయన తనవద్ద ఉన్న రేంజి రోవర్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చేశారు.

సాధారణంగా అమితాబ్ ఏదైనా కారు కొన్నారంటే దాన్ని మూడు నాలుగేళ్లు వాడిన తర్వాత అమ్మేసి, మరో కొత్త కారు కొంటారు. కానీ ఈ కారు మాత్రం 2002 నుంచి.. అంటే దాదాపు 12 ఏళ్లుగా అమితాబ్ దగ్గరే ఉంది. అదంటే ఆయనకు చాలా ఇష్టం. అయినా చాలా తక్కువసార్లు మాత్రమే ఆ కారును ఉపయోగించారు. సరోద్ కోరిక గురించి తెలియగానే ఆమెకు దాన్ని బహుమతిగా ఇచ్చేశారని అమితాబ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై దీపక్ సావంత్ ను అడిగితే, 'నా భార్యకు బచ్చన్ జీ ఓ కారు బహుమతిగా ఇచ్చారు' అని చెప్పాడు.

No comments:

Post a Comment