బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ స్మారక అవార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెల 12న జరగనున్న కార్యక్రమంలో భండార్కర్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఇదే సందర్భంగా నిన్నటి తరం బాలీవుడ్ నటి తనూజ, మరాఠీ నటి ఉమా భెండేలు రాజ్‌కపూర్ స్మారక జీవితకాల సాఫల్య అవార్డులను అందుకోనున్నారు. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలను రూపొందించిన భండార్కర్ ప్రస్తుతం ‘కేలండర్ గర్ల్స్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
No comments:
Post a Comment