బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు. వెండితెరపై కాదు నిజజీవితంలోనే అతడీ క్రతువు నిర్వహించబోతున్నాడు. ఆశర్చర్యమనిపించినా ఇది నిజం. పెళ్లికాని ఈ కండలవీరుడు కన్యాదానం ఎలా చేస్తాడని అనుకుంటున్నారా?
నటుడు పులకిత్ సామ్రాట్ కు సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయనున్నాడు. పులకిత్ పెళ్లాడబోయే అమ్మాయి శ్వేత రొహిరా- సల్మాన్ కు రాఖీ కట్టిన సోదరి. ప్రతి సంవత్సరం సల్మాన్ కు ఆమె రాఖీ కడుతుంది.
కాగా, పులకిత్, శ్వేత వచ్చే ఏడాది గోవాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే శ్వేత తండ్రి ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో కన్యాదానం చేసే బాధ్యతను సల్మాన్ ఖాన్ తీసుకున్నారు. సోదర ప్రేమంటే ఇదేనేమో!

No comments:
Post a Comment