అక్కా చెల్లెళ్లిద్దరూ మళ్లీ యుద్ధానికి  సిద్ధం అయ్యారు. ఒకావిడ ప్రేమకు ఆహ్వానం పలుకుతోంది. ఇంకో ఆమె పిడిగుద్దులు  కురిపించేందుకు రెడీ అవుతోంది. ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ ఇంకెవరో కాదు. అందాల రాణి ప్రియాంక చోప్రా. ఆమె చెల్లెలు పరిణితి చోప్రా. పరిణితి నటించిన  దావతె ఇష్క్, ప్రియాంక నటించిన మేరీ కామ్ లు సెప్టెంబర్ 5 నే  రిలీజవుతున్నాయి. రెండు సినిమాలూ బాక్సాఫీసు బద్దలు కొట్టాలని ఇద్దరూ  కోరుకుంటున్నారు. 
గతేడాదీ వీరిద్దరి సినిమాలూ ఒకే సారి  విడుదలయ్యాయి. పరిణితి నటించిన శుధ్ దేశీ రొమాన్స్, ప్రియాంక నటించిన  జంజీర్ లు ఒకేసారి వచ్చాయి. అయితే జంజీర్ సినిమా మాత్రం పైకి తేలకుండా  మునిగిపోయింది. శుధ్ దేశీ రొమాన్స్ బొమ్మ కూడా అంత పెద్దగా నడవ లేదు. ఈ  సారి ఏమవుతుందో చూడాలి. ప్రేమ గెలుస్తుందా లేక పిడిగుద్దులు గెలుస్తాయా  చూడాలి. 

No comments:
Post a Comment