Sunday, August 10, 2014

అమీర్ ఖాన్ కు ఎట్టకేలకు 'వస్త్రదానం'



ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా ఒక చిన్న ట్రాన్సిస్టర్ మాత్రమే అడ్డుపెట్టుకుని దర్శనమిచ్చిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు ఎట్టకేలకు వస్త్రదానం జరిగింది. విలె పార్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ హెగ్డే ఇందుకు పూనుకున్నారు. ఓ భారీ కటౌట్, పోస్టర్ ఉన్నచోట ఆయన స్వయంగా అమీర్ బొమ్మకు దుస్తులు వేశారు. దాంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకుని చప్పట్లు కొడుతూ హెగ్డే చర్యను స్వాగతించారు. అమీర్ చర్య భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఆకుపచ్చ షార్ట్స్, బూడిద రంగు టీషర్టు అమీర్ బొమ్మకు అలంకరించారు.

అమీర్ ఖాన్ చాలా మంచి నటుడని, ఆయన సత్యమేవ జయతే లాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని, అయితే ఇలాంటి చర్యలు మాత్రం ఇన్నాళ్లూ ఆయనను ఆరాధిస్తున్న వాళ్ల మనసుల్లో తప్పుడు ముద్ర వేస్తాయని హెగ్డే అన్నారు. పీకే చిత్రం నుంచి ఈ అభ్యంతరకరమైన నగ్న ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని అమీర్ ఖాన్ ను కోరారు. అయితే, సినిమాలో చూస్తే ఈ దృశ్యం ప్రాధాన్యత ఏంటో తెలుస్తుందని అమీర్ అంటున్నాడు.

No comments:

Post a Comment