ఈమధ్య కాలంలో బ్యాంకాక్‌లో తెలుగు సినిమా షూటింగ్‌లనేవి సర్వసాధారణమైపోయాయి. పాటలు, టాకీపార్ట్, యాక్షన్ పార్ట్‌లను బ్యాంకాక్‌లో ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. కానీ లేటెస్ట్‌గా ‘పవర్’ సినిమా కోసం భారీ ఛేజ్ షూట్ చేయడం టాక్ ఆఫ్ ది బ్యాంకాక్ అయ్యింది. రెండు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో భారీ ఎత్తున ఈ ఛేజ్‌ని రవితేజ, తదితరులపై ప్రముఖ బాలీవుడ్ ఫైట్‌మాస్టర్ అలెన్ అమిన్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా రచయిత కె.ఎస్. రవీంద్రనాథ్ (బాబి) దర్శకునిగా పరిచయమవుతున్నారు.
No comments:
Post a Comment