Sunday, August 10, 2014

షారుక్ తో మహిళా పోలీస్ అధికారి చిందులు


 బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలసి పశ్చిమ బెంగాల్ మహిళా పోలీస్ అధికారి డాన్స్ చేయడం వివాదంగా మారింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సంఘటన జరిగింది.  పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకులు ఈ సంఘటనపై మండిపడుతున్నారు.

శనివారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో కోల్ కతా పోలీసుల వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మమతా బెనర్జీ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో షారుక్ తన చిత్రంలో పాటకు డాన్స్ చేశారు. యూనిఫామ్ లో ఉన్న సంపా హల్డర్ అనే మహిళా ఎస్ ఐ అతనితో కలసి చిందులేశారు. దీనిపై మాజీ ఐపీఎస్ అధికారులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మామూలు దుస్తుల్లో డాన్స్ చేసుంటే అభ్యంతరం ఉండేది కాదని, యూనిఫామ్ ధరించి డాన్స్ చేయడానికి ఉన్నతాధికారులు ఎలా అనుమతించారంటూ విమర్శించారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు.
 

No comments:

Post a Comment