బాలీవుడ్ తెరపై అప్పుడప్పుడు దర్శనమిచ్చి.. ఇటీవల నిర్మాతగా మారిన హైదరాబాద్ అమ్మాయి దియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సాహిల్ సంగాను వచ్చే ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకునేందుకు దియా మీర్జా నిశ్చయించుకున్నారు.
నిర్మాత మారిన దియా మీర్జా లవ్ బ్రేక్ అప్ జిందగీ, తాజాగా విద్యాబాలన్ తో బాబీ జాసూస్ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి సాహిల్ తో గత సంవత్సరమే వివాహం జరగాల్సి ఉండేది.
అయితే బాబీ జాసూస్ నిర్మాణం కారణంగా 2015 వరకు పెళ్లి వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమం సందర్బంగా సాహిల్, దియా మీర్జాల మధ్య ప్రేమ చిగురించింది.
No comments:
Post a Comment