
గతంలో బెంగాలీ సినీ అవకాశాలు వచ్చినప్పటికీ, భయపడి ఆగిపోయిన ఆమె ఇప్పుడు దాన్ని అధిగమించి, ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘‘తెలుగు, తమిళం, ఇంకా ఇతర భాషల్లో నటించిన నేను బెంగాలీ అనగానే భయపడేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ భయం వదిలించుకున్నాను. ఈ చిత్రంలో కొందరు అద్భుతమైన నటీనటులతో కలసి నటించనున్నాను’’ అని ఆమె చెప్పారు.
జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, ఐశ్వర్యారాయ్‌తో కలసి నటించనున్నట్లు చాలా కాలంగా వినిపిస్తున్న వార్తల గురించి కూడా సుస్మితా సేన్ వివరణ ఇచ్చారు. ‘‘ఓ స్క్రిప్టు గురించి మేమిద్దరం ఆలోచిస్తున్న మాట నిజం. అది ఎప్పుడు కార్యరూపం ధరిస్తుందన్నది మాత్రం నిర్మాత గౌరాంగ్ దోషీయే చెప్పాలి’’ అని ఈ అందాల నటి తెలిపారు.
No comments:
Post a Comment