Monday, August 4, 2014

సుజానే 400 కోట్లు అడగలేదు


 విడాకుల సమయంలో తనకు 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సుజానే డిమాండ్ చేసిందని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని, అవన్నీ కట్టుకథలని హృతిక్ రోషన్ కొట్టిపారేశాడు. ఈ కథనాలపై తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెళ్లగక్కాడు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మీడియాలో హృతిక్ - సుజానేల విడాకుల విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

అయితే, సుజానే అంటే ఇప్పటికీ తనకెంతో ప్రేమ అని హృతిక్ అంటున్నాడు. పదమూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్లు ఇటీవలే విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ విడాకుల విషయంలో, ఆమె భరణం కోరినట్లు వస్తున్నవన్నీ కట్టు కథలని, తన ఇష్టసఖిని బద్నాం చేస్తున్నారని అన్నాడు. తన సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డాడు.
 

No comments:

Post a Comment