Monday, August 11, 2014

మహేష్ తో శ్రుతిహాసన్ రొమాన్స్


 మహేష్ తో శ్రుతిహాసన్ రొమాన్స్

అందాల నటి శ్రుతి హాసన్... ప్రిన్స్ మహేష్ బాబు సరసన బంపర్ ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే తాజా చిత్రంలో ఆమె కథానాయికిగా నటించనుంది.  ఈ సినిమా షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై తొలి షాట్ ను చిత్రీకరించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్... సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబుతో ఇప్పటికే శ్రుతిహాసన్ ఓ ఐటం సాంగ్ చేసింది. అయితే మహేష్ బాబుతో కలిసి నటించటం ఆమెకు ఇదే తొలిసారి. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సంపత్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు. కాగా శ్రుతి హాసన్ ప్రస్తుతం విశాల్ హీరోగా తమిళ చిత్రం 'పూజై' షూటింగ్ లో బిజీగా ఉంది.

No comments:

Post a Comment