Sunday, August 10, 2014

ప్రపంచం గర్వించే సినిమా తీయడమే నా కల

ప్రపంచంలో ప్రతి ఒక్కరు గర్వపడేలా సినిమా తీయడమే తన లక్ష్యమని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. తాను మరణించేలోపు అలాంటి సినిమా తీస్తానని చెప్పారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ తన వ్యక్తిగత, సినీ జీవిత ఆశయాల గురించి మాట్లాడారు.

తన ముగ్గురు పిల్లలు సుఖసంతోషాలతో్ ఉండాలని, తండ్రిగా అది తన బాధ్యతని షారుక్ అన్నారు. షారుక్ బ్లాక్ బస్టర్ మూవీ చెన్నయ్ ఎక్స్ ప్రెస్ విడుదలై నిన్నటికి ఏడాది పూర్తయింది. అలాగే అతను నటించిన మరో సినిమా పరదేశ్ విడుదలై నిన్నటికి సరిగ్గా 17 ఏళ్లయింది. తాను నటించే ప్రతి సినిమాను తొలి, చివరి చిత్రంగా భావిస్తానని షారుక్ అన్నారు. డాన్స్ ప్రధానాంశంగా షారుక్ 'హ్యాపీ న్యూ ఇయర్' అనే చిత్రంలో నటిస్తున్నారు.

No comments:

Post a Comment